NEET పేపర్ లీక్ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. CJP (కాక్రోచ్ జనతా పార్టీ) తాజాగా చేసిన వ్యాఖ్యల ప్రకారం, విద్యార్థుల అసంతృప్తి పెరిగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని, ఇది 'టైమ్ బాంబ్' లా పేలొచ్చని హెచ్చరించింది.

CJP ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. NEET మరణించిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కూడా కోరింది. ఈ డిమాండ్లను కేంద్రం ఒక్కరోజు గడువులో నెరవేర్చాలని స్పష్టం చేసింది.

ఇవాళ CJP, కేంద్ర ప్రభుత్వం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని పట్ల ఉత్కంఠ నెలకొంది. CJP ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ, అసంతృప్తి పెరిగితే ఉద్యమం రాజీనామా డిమాండ్లకు మాత్రమే పరిమితం కాకపోవచ్చని, ప్రధాని మోదీ రాజీనామా డిమాండ్ కూడా రావచ్చని సూచించారు.

NEET వివాదం ఇప్పుడు ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకతపై పెద్ద చర్చగా మారింది. విద్యార్థులు మరియు యువతలో అసంతృప్తి పెరగడం వల్ల ఉద్యమం మరింత తీవ్రమవుతుందని CJP హెచ్చరిస్తూ, ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.