తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కెకె నగర్‌లో 11 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివసిస్తోంది. బాలిక తల్లి స్థానిక ఇళ్లలో పని చేస్తూ, అప్పుడప్పుడు తన కూతురిని కూడా వెంట తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ నెల 30వ తేదీన బాలిక తన తండ్రితో కలిసి 'జన నాయగన్' సినిమాకు వెళ్లింది. ఆ చిత్రంలో లైంగిక వేధింపులకు సంబంధించిన సన్నివేశాన్ని చూసిన బాలిక, తనతో జరిగిన ఘటనను వెంటనే తండ్రికి వివరించింది. దీంతో బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలల లైంగిక నేరాల చట్టం (POCSO) కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.