టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో దర్శకుడు రవి తన సినీ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రవి తన తల్లిదండ్రులకు మొదట ధన్యవాదాలు తెలిపి “వారి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా చెప్పారు.
దర్శకుడు మారుతిని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ “మీరు నన్ను డైరెక్టర్ అవుతానని నమ్మకపోతే నేను ఇక్కడ ఉండేదీ కాదు” అంటూ స్పష్టం చేశారు. నిర్మాతలు రాజేష్, సాయి రాజేష్ పట్ల తమ నమ్మకాన్ని జీవితాంతం మర్చిపోలేనిదిగా పేర్కొన్నారు. హీరోయిన్ గౌరీ నటనను ప్రశంసిస్తూ “సెకండ్ హాఫ్ లో ఆమె సన్నివేశం ప్రేక్షకులను కదిలిస్తుంది” అని రవి వెల్లడించారు.
చిరంజీవి పట్ల తన అభిమానాన్ని తెలిపి “ఈ సినిమా కలెక్షన్లు రెట్టింపు అవుతాయి” అని సరదాగా చెప్పారు. ఈ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో .








