2026-27 విద్యా సంవత్సరానికి గాను మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) నోటిఫికేషన్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3న మొదలై, సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.

దేశవ్యాప్తంగా 170 నగరాల్లో నవంబర్ 29న మూడు విడతల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు నవంబర్ 4 నుంచి పరీక్ష జరిగే రోజు వరకు IIM అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫలితాలను 2027 జనవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరీక్ష ద్వారా వచ్చే స్కోరు 2027 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది.

పరీక్షకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు IIM క్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.