బిహార్, గయా జిల్లాలోని గర్హ్ కర్మౌని గ్రామంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. ఒక రైతుకు చెందిన బావిలో మోటార్ పాడవడంతో, దానిని బాగు చేసేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు.

రిపేర్ పనులు చేస్తున్న సమయంలో బావిలో నుంచి ఒక్కసారిగా విషవాయువు వెలువడింది. ఆ వాయువును పీల్చిన వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి, అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.

మృతులను చమారి మాంఝి, ఆయన కుమారుడు దిల్‌చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.