భోపాల్‌లోని అశోకాగార్డెన్ ప్రాంతంలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి మోమోస్ తినేందుకు రోడ్డు పక్కన ఉన్న స్టాల్‌కు వచ్చింది. అదే సమయంలో నైట్ షిఫ్ట్ కోసం బయలుదేరిన ఆమె భర్త, తన స్నేహితుడితో కలిసి అనుకోకుండా అదే స్టాల్‌కు చేరుకున్నాడు.
తన భార్య మరొక వ్యక్తితో ఉండటాన్ని చూసిన భర్త షాక్‌కు గురయ్యాడు. వెంటనే వారిద్దరినీ నిలదీయడంతో అక్కడ వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ కాస్తా భౌతిక దాడికి దారితీసింది.
భర్త తన భార్యను, ఆమెతో ఉన్న వ్యక్తిని కొడుతూ దూషించడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనతో అక్కడ జనం గుమిగూడటంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ మొత్తం గొడవను కొందరు తమ ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది.








