న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ 'భారత్ 2047' పెయింటింగ్ పోటీని తాజాగా ప్రారంభించింది. భారతీయ దివాసం వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోటీలో ఎంపికైన పెయింటింగ్‌లను కాన్సులేట్ కార్యాలయంలో ప్రదర్శించనున్నారు.

ఈ పోటీలో పాల్గొనేందుకు న్యూయార్క్, న్యూ జర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, కనెక్టికట్ మరియు ఒహియో రాష్ట్రాల్లో నివసించే స్థానిక కళాకారులు, భారతీయ వలసదారులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు తమ పెయింటింగ్‌లను ఆగష్టు 10, 2026 నాటికి సమర్పించాల్సి ఉంటుంది.

పోటీలో పాల్గొనేందుకు దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచారు. ఆసక్తి గల అభ్యర్థులు https://forms.gle/FFQVwDqNTY4QrzTF8 వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా అందుబాటులో ఉన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.