భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రంగపురం వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 40.5 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన బినయ్ సర్కార్ ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా ఈ పట్టుబడింది.