ఆస్ట్రేలియాలో భారత్ తన కాన్సులర్ సేవలను మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు వేసింది. తాజాగా ఆరు కొత్త కాన్సులర్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో ఉన్న అద్దె కార్యాలయాల కంటే ఈ కొత్త కేంద్రాలు విస్తీర్ణంలో పెద్దవిగా ఉండటం విశేషం.

ఈ కొత్త కేంద్రాల్లో కౌంటర్ల సంఖ్యను పెంచడంతో పాటు, అదనపు సిబ్బందిని కూడా నియమించారు. దీనివల్ల అప్పూయింట్మెంట్లకు సంబంధించి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అప్పూయింట్మెంట్ సమర్పణ మరియు సేకరణ సమయాన్ని కూడా అధికారులు పెంచారు.

ప్రయాణికులు మరియు అక్కడి భారతీయుల సౌకర్యార్థం విశ్వసనీయమైన మల్టిలింగ్వాల్ కాల్ సెంటర్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ మార్పుల ద్వారా ఆస్ట్రేలియాలో భారత్ అందిస్తున్న కాన్సులర్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.