చెపాక్ స్టేడియంలో జరిగిన టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీ సాధించగా, జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.

ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 72 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 44 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ 85 పరుగులు చేసి సెంచరీకి చేరువలో నిష్క్రమించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుమార్ కుశాగ్ర 63 పరుగులతో నాటౌట్‌గా ఉండి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.

సౌత్ జోన్ బౌలర్లు ఈస్ట్ జోన్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. బౌలర్లలో చామ మిలింగ్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణ విజయ్ ఒక వికెట్ పడగొట్టారు. అభిమన్యు ఈశ్వరన్ రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయాడు.