చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామానికి చెందిన మల్లెబోయిన లింగస్వామి కుమార్తె ప్రణీత రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో సత్తా చాటింది. ఈ క్రీడా పోటీల్లో ప్రణీత ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ విజయంపై మందోళ్లగూడెం గ్రామ సర్పంచ్ తంగెళ్ళ వెంకటేశం స్పందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన క్రీడాకారిణి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రణీతతో పాటు, ఆమె విజయానికి సహకరించిన టీమ్ సభ్యులందరికీ గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ అభినందనలు తెలిపారు. క్రీడల్లో రాణించే యువతకు గ్రామ పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో ప్రణీత జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని సర్పంచ్ ఆకాంక్షించారు. తద్వారా మన ప్రాంతానికి, గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని ఆయన కోరారు.








