వరద బాధితులకు సహాయం చేసేందుకు 72 మంది యూట్యూబర్లు సేకరించిన నిధులను అస్సాం ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది. ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఏ విధంగా ఖర్చు చేశారనే అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
ఈ నిధుల సేకరణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను అస్సాం పోలీసు సైబర్ సెల్ చేపట్టింది. ఫండ్‌రైజింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న అన్ని ఖాతాలను సైబర్ సెల్ అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రజల కోసం యూట్యూబర్లు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం గుర్తించింది. వరద సహాయక చర్యల్లో భాగస్వాములైన ఆ యూట్యూబర్లను గమోసాలతో సత్కరించాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నిర్ణయించారు.








