ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో వాటర్ ట్యాంక్ నిర్మిస్తే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం 'జనతా గ్యారేజీ' కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ వార్డులో పర్యటించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా స్థానిక కాలనీవాసులు తమ సమస్యలను జీవన్‌రెడ్డికి వివరించారు. అపార్ట్‌మెంట్ పక్కన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టవద్దని, దీనిని అడ్డుకోవడంలో తమకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. కాలనీవాసుల అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలపై అధికారులు, పోలీసులు ఒత్తిడి తీసుకురావడం సరికాదని జీవన్‌రెడ్డి విమర్శించారు. కాలనీవాసులను బెదిరించడం మానుకోవాలని ఆయన సూచించారు. ట్యాంక్ నిర్మాణం కొనసాగితే స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు.








