అంతర్జాతీయ విద్యార్థుల విద్యా విధానంపై US ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై విద్యార్థులు తమ విద్యాభ్యాసం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో కోర్సు లేదా విభాగాలను మార్చుకునే అవకాశం ఉండదు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకైతే ఈ నిబంధన మరింత కఠినంగా ఉంటుంది; వారు తమ కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వలసదారులకు ప్రభుత్వ సహాయం అందే విషయంలోనూ అధికారులు కొత్త నిర్ణయాధికారాన్ని తీసుకున్నారు. వలసదారులు ప్రభుత్వ పథకాలు లేదా ఇతర సహాయాన్ని పొందే అంశంపై అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనల వల్ల అమెరికాలో ఉంటున్న వలసదారులపై నేరుగా ప్రభావం పడనుంది.
అమెరికా పౌరుల కుటుంబ సభ్యులకు కూడా ఈ కొత్త వలస నియమాలు వర్తిస్తాయి. విద్యార్థులు, వలసదారులు ఈ మార్పులను గమనించి, తమ విద్యా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.








