అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీయులకు ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను యుఎస్ సెక్యూరిటీ సంస్థ పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ నిబంధనను రద్దు చేస్తే, ఉద్యోగం కోల్పోయిన వెంటనే సదరు వ్యక్తులు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ప్రస్తుతం హెచ్-1బి (H-1B), ఇ-1 (E-1), ఇ-2 (E-2), ఇ-3 (E-3), ఎల్-1 (L-1), ఒ-1 (O-1) మరియు టిఎన్ (TN) వీసా హోల్డర్లకు ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వీసా స్థితిని మార్చుకోవడానికి ఈ సమయం ఎంతో కీలకంగా ఉంటుంది.
ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ఎటువంటి పబ్లిక్ కమెంట్ పీరియడ్ లేదు. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది.







