అనకాపల్లి జిల్లా కేంద్రంలో తన భర్తతో విడిపోయి నివసిస్తున్న ఒక మహిళ, చేపల మార్కెట్ సమీపంలోని సచివాలయంలో పనిచేసే రమేష్ (పేరు మార్చాము) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె కూతురుపై రమేష్ కన్నేశాడు. ఆ బాలిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది.
తల్లి ప్రియుడైన రమేష్, బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో తల్లి అతడిని అడ్డుకోకుండా సహకరించింది. జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, బాత్‌రూమ్ శుభ్రం చేసే యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
బాలికను గమనించిన తల్లి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో పోలీసులు బాలికను విచారించగా, అసలు విషయం బయటపడింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.








