అనకాపల్లిలో భార్గవ్ ప్రకాశ్ అనే వ్యక్తి, తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసినా సదరు బాలిక తల్లి అతడిని అడ్డుకోకుండా ప్రోత్సహించింది. ఆగస్టు 7న ఈ దారుణం జరగగా, మనస్తాపానికి గురైన బాధితురాలు బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
స్థానికులు బాలికను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు భార్గవ్ ప్రకాశ్ స్థానిక సచివాలయంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బాలలపై లైంగిక నేరాల చట్టం (POCSO) కింద భార్గవ్ ప్రకాశ్, బాలిక తల్లిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.








