స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ (Amazon Great Freedom Sale) పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు 32 అంగుళాల స్మార్ట్‌టీవీలపై ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఫిలిప్స్, టీసీఎల్, షావోమీ, వీడబ్ల్యూ వంటి బ్రాండ్ల టీవీలు తక్కువ ధరకే లభిస్తున్నాయి.

శాంసంగ్ 32 అంగుళాల HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ. 15,490కి లిస్ట్ కాగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో రూ. 13,941కే సొంతం చేసుకోవచ్చు. ఫిలిప్స్ 6100 సిరీస్ టీవీ ధర బ్యాంక్ ఆఫర్ల తర్వాత రూ. 14,400కి, అలాగే టీసీఎల్ క్యూఎల్ఈడీ (QLED) గూగుల్ టీవీ ధర రూ. 14,841కి తగ్గుతుంది. ఈ టీవీలు వాయిస్ సెర్చ్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఓటీటీ యాప్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి.

బడ్జెట్ ధరలో టీవీ కోరుకునే వారికి వీడబ్ల్యూ (VW) స్పెక్ట్రా సిరీస్ ఆప్షన్‌గా ఉంది. దీని ధర రూ. 9,499 ఉండగా, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 284 క్యాష్‌బ్యాక్ పొంది రూ. 9,215కే కొనుగోలు చేయవచ్చు. షావోమీ ఎఫ్ సిరీస్ టీవీ ధర బ్యాంక్ ఆఫర్లతో రూ. 11,700కు లభిస్తోంది.