విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నారా రోహిత్ తెలంగాణ పోలీస్ ఆఫీసర్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. జూలై 25న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం నుంచి ప్రధాన పాత్రలను పరిచయం చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందులో భాగంగా వెంకటేష్ పోషిస్తున్న 'చిట్టిబాబు' పాత్రను మొదటగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, రావు రమేష్, బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ కలగలిపి రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.








