అమెరికాలో H-1B వీసా దరఖాస్తుల ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) పూర్తి చేసింది. మొత్తం 85,000 వీసా కోటాను భర్తీ చేసినట్లు సంస్థ ప్రకటించింది. మొదటి లాటరీలో ఎంపిక కాని వారికి ఇకపై రెండో అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
ఈసారి ఎంపిక ప్రక్రియలో భాగంగా అధిక వేతన ఆఫర్లకు (Higher Salary Offers) ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధానం ద్వారానే అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు USCIS వెల్లడించింది. దీనివల్ల వేతన స్థాయిని బట్టి ఎంపికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.







