జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యుల వివరాలను సర్ ఫారంలో నమోదు చేసి, సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLO) అందజేశారు.
ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, అర్హులైన వారందరూ వివరాలను ఫారాల్లో నింపి అధికారులకు అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.








