ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. 259 పరుగుల లక్ష్య ఛేదనలో జట్టును గెలిపిస్తారని, చాలా కాలం తర్వాత వీరి బ్యాటింగ్ చూస్తామని ఆశించిన అభిమానులకు గట్టి షాక్ తగిలింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 21 బంతులు ఆడి, ఒక ఫోర్ సహాయంతో 11 పరుగులు మాత్రమే చేశాడు. సామ్ కరన్ వేసిన బంతికి హ్యారీ బ్రూక్ క్యాచ్ పట్టడంతో రోహిత్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన కేవలం 6 బంతులు మాత్రమే ఆడి, ఒక ఫోర్ కొట్టి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో భారత్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
37 ఏళ్ల రోహిత్, 37 ఏళ్ల కోహ్లీకి ఈ సిరీస్ అత్యంత కీలకం. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరు.. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలంటే ప్రతి మ్యాచ్‌లో రాణించాల్సి ఉంది. జూనియర్ ఆటగాళ్లు వేచిచూస్తున్న ఈ సమయంలో ఇలాంటి ప్రదర్శనలు చేస్తే జట్టులో చోటు కోల్పోవడం ఖాయం.
సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గంభీర్.. రో-కోలు ఇలా ఆడితే ఛాన్స్ ఇచ్చినట్లే. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ ఆడాలంటే ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించడం చాలా కీలకం కాబట్టి, మిగిలిన రెండు వన్డేల్లో వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.







