కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేరళలో విజయ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభించిన కొద్ది సేపటికే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. బుకింగ్లు తెరిచిన 150 నిమిషాల్లోనే ఈ చిత్రం బుకింగ్లు నమోదు చేసుకుంది. సినిమా లీక్ అయినప్పటికీ, ఈ స్థాయిలో బుకింగ్లు నమోదు కావడం విజయ్ స్టార్ పవర్‌కు నిదర్శనం.

ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ భారీ స్పందనతో కేరళలో సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ ఖాయం.