హైదరాబాద్‌లోని అమరజ్యోతి వద్ద మంగళవారం నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఎస్సై ఉద్యోగార్థుల వయోపరిమితిని 38 ఏళ్లకు, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల వయోపరిమితిని 36 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో తమ వయస్సు పెరిగిపోయిందని, దీనివల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని వారు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వయోపరిమితిని సడలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. త్వరలో విడుదల కానున్న పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఈ మార్పులు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.