అమెరికాలో ఒబెసిటీ సమస్య పెరుగుతున్న సమయంలో, జపాన్‌లో అధిక బరువు ఉన్నవారు ఆరు శాతం మాత్రమే. ఈ తేడాకు కారణం ప్రత్యేక డైట్ లేదా ఔషధాలు కాదు, సాధారణ జీవనశైలి.
జపాన్ ప్రజలు కారు ఉన్నా చిన్న పనులకు నాలుగడుగులు వేస్తారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్డ్ ఫుడ్‌లు తినడం అరుదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ప్రొటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు వారి రోజువారీ భోజనంలో భాగం.
ఈ సమతుల్య ఆహార అలవాట్లు వారిని ఒబెసిటీ నుంచి కాపాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ట్రెండ్లు మారినా, జపాన్ ప్రజలు సంప్రదాయ ఆహారాన్ని విస్మరించలేదు.
ఇండియాలో కూడా ఒబెసిటీ పెరుగుతున్న సమయంలో, స్థానిక పంటలు, సంప్రదాయ వంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఈ స్థితి సూచిస్తుంది. పెద్దల మాటలు కొట్టిపారేయకుండా, మన ఆహార అలవాట్లను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది.








