ప్రతి సంవత్సరం పౌష్టికాహార లోపంతో పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తక్కువ బరువు, రక్తహీనత, ఉత్సాహం లేకపోవడం వల్ల చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. ఈ సమస్య పేద మరియు మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు పిల్లలకు నెలకు 16 గుడ్లు, రెండున్నర కేజీల బాలామృతం ఇస్తుంది. 3-6 సంవత్సరాల పిల్లలకు రోజుకు ఒక గుడ్డు, భోజనం మరియు స్నాక్స్ అందిస్తున్నారు. కానీ ఈ పోషకాహారం ఇంటికి పంపించడం వల్ల సరిగ్గా తీసుకోవడం లేదు.
అధికారులు పర్యవేక్షణను కేవలం వారోత్సవాల సమయంలో మాత్రమే చేస్తున్నారు. మిగతా రోజుల్లో పిల్లల ఆరోగ్యంపై పట్టించుకోవడం లేదు. ఐసీడీఎస్ అధికారుల క్షేత్ర స్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్ల తల్లులు పౌష్టికాహారం ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోతున్నారు.
గర్భిణులు నెలలు నిండకుండా ప్రసవిస్తున్నారు. ఇలాంటి పిల్లలు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పాలు, ఆకుకూరలు, గుడ్లు క్రమంగా తీసుకోకపోవడం వల్ల రక్తహీనత మరియు బరువు పెరగకపోవడం పెరుగుతోంది.
తల్లీదండ్రులు అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కార్యక్రమాలు నిరర్థకంగా మారుతున్నాయని అరోపిస్తున్నారు. పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ కాకపోతే, ఇంత కార్యక్రమాలు నామమాత్రపు పర్యవేక్షణతో ముగుస్తున్నాయి.







