బీహార్ వైశాలి జిల్లాలో ఒక మహిళా హోంగార్డ్, ఆమె సోదరిని మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు అపహరించిన ఘటన బహిర్గతమైంది. నిందితుల్లో ఆమెకు తెలిసిన సుబోధ్ పాశ్వాన్, అతని సోదరుడు, ఇద్దరు సహచరులు ఉన్నారు.

గోరౌల్ పోలీసులు తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుల ఇంటిపై దాడి చేసి బాధితులను రక్షించారు. కానీ నిందితుడు పారిపోయాడు. పోలీసులు ఈ కేసును 'ప్రేమ వ్యహారం'గా పేర్కొన్నారు.

మహువా పోలీస్ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఘటనకు కారణం గతంలో రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత బాధితురాలు నిందితుడిని దూరం చేసిందని, కోపంతో అతను ఈ చర్య తీసుకున్నాడని తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.