అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధి నియంత్రణపై కీలక ప్రకటన చేశారు. సోమవారం (జులై 13) ఫాక్స్ న్యూస్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో, ‘మేము హార్మూజ్ జలసంధిని కాపాడుతాం. బహుశా దానిని మేమే నియంత్రిస్తాం. అందుకు మాకు పరిహారం చెల్లించాలి’ అని వ్యాఖ్యానించారు.

2026లో అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత జూన్‌లో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది. కానీ ఇటీవల ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఇరాన్ హార్మూజ్ జలసంధిని మళ్లీ క్లోజ్ చేసింది. నౌకలపై దాడులు కూడా జరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

ఈ పరిస్థితిలో ఇరాన్ హార్మూజ్ గుండా వెళ్లే నౌకలపై పన్నులు విధిస్తున్నట్లు ఆదేశించింది. భారత్ వంటి దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ జలాలపై ఏ దేశానికి సుంకాలు విధించే అధికారం లేదని వాటి వాదన.

ట్రంప్ ప్రకటన ప్రపంచ దేశాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ఇరాన్ ఈ ప్రాంతంలో తన భద్రతా దళాలను పెంచింది. అమెరికా ఇరాన్‌పై కొత్తగా ఆంక్షలు విధించే అవకాశాలు పరిశీలిస్తోంది.