అయోధ్యలోని గుప్తార్ ఘాట్ వద్ద పవిత్ర సరయూ నదిలో పడవపై విహరిస్తూ నలుగురు యువకులు మద్యం సేవించి, మాంసం తిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.

ఈ వీడియోను గమనించిన పోలీసులు భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి, నిందితుల్లో లవ్‌కుష్ నిషాద్, జితేంద్ర నిషాద్, రాజ్‌కుమార్ నిషాద్‌లను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనలో పాల్గొన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీస్ అధికారి తెలిపారు.