అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య టీమిండియా 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలివుండగానే భారత్ 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది.
తర్వాత లక్షఛేదనకు దిగిన అఫ్గాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రహెమానుల్లా గుర్బాజ్ (41), రహెమత్ షా (79), సాదిఖుల్లా అటల్ (42) రాణించినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, గుర్నూర్ మూడేసి వికెట్లు తీశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు సెంచరీలతో ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 110 బంతుల్లోనే 22 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 154 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 79 బంతుల్లోనే ఏడు సిక్స్‌లు, 14 ఫోర్లతో 125 పరుగులు సాధించాడు.




