గుజరాత్ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా జైషే మహమ్మద్ టెర్రర్ మాడ్యూల్‌ను గుర్తించి, ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బిలాల్ అభిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖి, మహమ్మద్ హసన్ కరాడియా, మహమ్మద్ సునాసరలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ అరెస్టులకు ముందు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది మంది జైషే అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రకార్యకలాపాలను నిర్వహించేందుకు వీరు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఆ ఎనిమిది మందిని విచారిస్తున్న సమయంలోనే ఈ ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి.

అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు జులై 24 వరకు పోలీసు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.