తెలుగు రాష్ట్రాల ఎగుమతి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో 10TV గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ వ్యాపార సంస్థల విజయగాథలను, వారి ప్రయాణాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఫార్మా, హాస్పిటాలిటీ, గ్రానైట్, ఇంజినీరింగ్, మైనింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫుడ్, టెక్నాలజీ వంటి రంగాల్లో అంతర్జాతీయ మార్కెట్లలో సత్తా చాటుతున్న పారిశ్రామికవేత్తలను ఈ వేదికపై సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విస్తరణ చేస్తున్న సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమానికి విదేశీ వాణిజ్య, కస్టమ్స్ విభాగాలకు చెందిన అధికారులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తెలుగు రాష్ట్రాల పాత్రను, ఎగుమతుల ప్రాధాన్యతను ఈ సందర్భంగా వారు గుర్తించారు.