మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల శరీరంపై దద్దుర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని గ్రామస్థులు తెలిపారు.
ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీ వల్ల ఈ సమస్యలు ఉన్నాయని, విస్తరణ చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని వారు భయపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ప్రక్రియను గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు.
గజ్వేల్ నియోజకవర్గ BRs చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ధర్నాకు సంఘీభావం తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ విస్తరణ సరికాదని వారు పేర్కొన్నారు. చివరగా గ్రామస్తులు తమ వినతిపత్రాన్ని DRVO అంబదాస్ రాజేశ్వర్ కు సమర్పించారు.







