మన తెలంగాణ/మదనపురం: చేపల వేట కు వెళ్లిన మత్స్యకారుడిపై మొసలి దాడి చే సిన ఘటన ఆదివారం మదనపురం మండల పరిధిలో చోటుచేసుకుంది. గోపన్‌పేటకు చె ందిన మత్స్యకారుడు మహేష్ (30) రామన్‌పాడు బ్యాక్‌వాటర్‌లోని కొత్తపల్లి వంతెన సమీపంలో థర్మకోల్ తెప్పపై చేపలు పడుతుండగా నీటిలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన భారీ మొసలి అతడిపై దాడి చే సి నీటిలోకి లాగేందుకు యత్నించింది. మ హేష్ కేకలు వేయడంతో సమీపంలోని తోటి మత్స్యకారులు వెంటనే అక్కడికి చేరుకుని మొసలి బారి నుంచి అతడిని రక్షించారు.

మొసలి దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్ర థమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనతో రామన్‌పాడు బ్యాక్‌వాటర్ పరిసర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారుల్లో భయాందోళన నెలకొంది.

మొసళ్ల బారి నుంచి రక్షణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.