Telugu » Movies » Anchor Vishnu Priya Bhimeneni Income Via Instagram Subscription
Vishnupriya : ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోనే బతికేస్తున్నారు. తమ రెగ్యులర్ అప్డేట్స్, ఫొటోలు, వీడియోలు, పర్సనల్ సంగతులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి మాములు జనాల వరకు అందరూ సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని పలువురు నటీమణులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సెర్స్ సబ్ స్క్రైబర్స్ పేరిట డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో సబ్ స్క్రైబ్ ఆప్షన్ వచ్చాక కొంతమంది మహిళా సెలబ్రిటీలు పర్సనల్ కంటెంట్ చూపిస్తామని, తమ గురించి ఇంకా తెలుసుకోండి అని, అందరికంటే ముందు సబ్ స్క్రైబర్స్ కే మా కంటెంట్ చుపిస్తామంటూ నెలకు 390 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. కొంతమంది మహిళా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సెర్స్ అయితే ఈ సబ్ స్క్రైబ్ ఆప్షన్ తోనే నెలనెలా కోట్లు సంపాదిస్తున్నారు కూడా.
టాలీవుడ్ లో యాంకర్ గా, నటిగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ లో సబ్ స్క్రైబ్ పేరిట పర్సనల్ కంటెంట్ అంటూ వైరల్ అయి వివాదంలో నిలిచింది. కానీ ఆ వివాదం ఆమెకు కలిసొచ్చి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో సబ్ స్క్రైబర్స్ పెరిగారు. ప్రస్తుతం ఆమెకు 7568 మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అంటే నెలకు ఒక్కొక్కరికి 390 చొప్పున వేసుకుంటే మొత్తంగా నెలకు 29 లక్షల 51 వేలకు పైనే సంపాదిస్తుంది. ఈ సబ్ స్క్రైబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
కేవలం ఫొటోలు, వీడియోలు, తన డైలీ రొటీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా సబ్ స్క్రైబర్స్ ద్వారా దాదాపు 30 లక్షలు నెలకు సంపాదించేస్తుంది. దీనికంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటీవల మన టాలీవుడ్ సినీ, టీవీ నటీమణులు చాలా మంది ఈ ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రైబ్ ఆప్షన్ పెట్టుకొని డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు.








