రామగిరిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాలికల హాస్టల్ విద్యార్థినులు జూలై 8న రాత్రి 11 గంటల తర్వాత తమ హాస్టల్ ముందు నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. తాగునీరు, వాడుక నీరు లభించకపోవడంతో విద్యార్థినులు ఆందోళన తీవ్రతరం చేసి వీసీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు.
వీసీ విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు బెదిరింపు ధోరణితో 'మీరు పరీక్షలు ఎలా రాస్తారు? పాసవుతారా?' అని ప్రశ్నించినట్లు విద్యార్థినులు తెలిపారు. నూతన భవన నిర్మాణ పనులకు నీటిని మళ్లీంచడం వల్ల ఈ సంక్షోభం ఏర్పడిందని వారు ఆరోపించారు.
పోలీసులు మరియు రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినా విద్యార్థినులు వినలేదు. తదనంతరం జిల్లాకోలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి వచ్చి విద్యార్థినులతో చర్చించి, తక్షణమే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.








