అమెరికాలోని పబ్లిక్ రేడియో స్టేషన్ WDIY 88.1 FM తన అవార్డు గ్రహీత మాసిక ప్రోగ్రామ్ 'టీన్ సైన్సిస్ట్' కోసం భారతీయ యువ శాస్త్రవేత్త అర్యాష్ ష్యామ్‌ను కొత్త హోస్ట్‌గా నియమించింది. ఈ బాధ్యతల్లో భాగంగా ఆయన శాస్త్రీయ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలను శ్రోతలకు వివరించనున్నారు.
అర్యాష్ ష్యామ్ తన ప్రోగ్రామ్‌లో నాసా (NASA), ఎంఐటి (MIT), స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తారు. శాస్త్రవేత్తల పరిశోధనలను విశ్లేషించి, వారి కృషిని సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కొత్త హోస్ట్ హోదాలో అర్యాష్ ష్యామ్ తన మొదటి ఎపిసోడ్‌ను ఆగష్టు 6, 2026న సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం చేయనున్నారు.







