హనుమకొండలో శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నైనీ రాజేందర్ రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాల అభిషేకం చేశారు. నాలుగు నెలల క్రితం తాను కోరిన మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ నిధులను విడుదల చేశారని ఆయన తెలిపారు.
గత 50 ఏళ్లుగా సాంకేతిక విద్య, శిక్షణ అందిస్తున్న ఈ సంస్థకు కొత్త భవనం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో రైల్వేలు, ఇతర పరిశ్రమల్లో రాబోయే ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, స్థానిక యువతకు అవసరమైన నైపుణ్యాలను ఐటీఐలో అందించాలని ఆయన యాజమాన్యానికి సూచించారు.
సుమారు 50,000 మంది పూర్వ విద్యార్థుల వివరాలను సేకరించి, వారితో సంస్థకు అనుబంధాన్ని పెంచాలని ఎమ్మెల్యే కోరారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆ పూర్వ విద్యార్థుల సహకారంతో సంస్థను అభివృద్ధి చేయాలని, క్యాంపస్‌ను పచ్చదనంతో తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఈ అభివృద్ధి పనుల కోసం సంబంధిత శాఖలు, కార్పొరేషన్ అధికారులతో తాను సమన్వయం చేసుకుంటానని ఆయన చెప్పారు.







