కృప అనే మెడికల్ రిప్రజెంట్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి ఊటీకి వెళ్లినప్పుడు ఎదురైన దాడులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విశాల్, దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య మరియు జయప్రకాష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆర్.బి చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ దర్శకత్వం వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
విశాల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దుషారా విజయన్, అంజలి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తంబి రామయ్య, జయప్రకాష్ వంటి ఇతర నటులు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
అయితే, ఈ సినిమా కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. దర్శకుడు విశాల్ ఆసక్తికరమైన సన్నివేశాలను రూపొందించడంలో విఫలమయ్యారు. సెకండాఫ్ మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు బోరింగ్‌గా ఉండటంతో పాటు, చాలా సంఘటనలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి.
మొత్తానికి, ఈ సినిమాలో రొటీన్ ఎమోషన్స్ మరియు ఆసక్తి లేని కథనం ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్ మినహా మిగిలిన భాగంలో ఉత్సుకతను పెంచే అంశాలు తక్కువగా ఉన్నాయి. కథలో చెప్పాలనుకున్న ప్రధాన అంశం కూడా సరిగ్గా పండలేదు.








