ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో తన ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ బ్రాంచ్‌ను ప్రారంభించారు. తన కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'జులాయి' విడుదలైన అదే తేదీన ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడం ఒక యాదృచ్చికంగా మారింది.

ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిలో అక్కడ ఏర్పాటు చేసిన పుష్ప రాజ్ ప్రతిమ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రతిమ 'తగ్గేదేలే' మ్యానరిజంతో ఉండటం విశేషం.