పార్లమెంటు వైపు నిరసనగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఈ ఘటనపై స్పందించిన నటులు దిల్‌జిత్ దోసాంజ్, అనురాగ్ కశ్యప్, సోనాక్షి సిన్హా, హుమా కురేషి పోలీసుల తీరును విమర్శించారు.

విద్యార్థుల పట్ల పోలీసులు ప్రదర్శించిన తీవ్రతను వీరు తప్పుబట్టారు. విద్యార్థులు లేవనెత్తుతున్న అభ్యర్థనలను ప్రభుత్వం సావధానంగా వినాలని నటులు కోరారు.