iQOO సంస్థ తాజాగా Z11 పేరుతో కొత్త 5G ఫోన్‌ను ఆవిష్కరించింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ. 31,499గా నిర్ణయించారు.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ (ఫోన్ వేగాన్ని పెంచే చిప్) అమర్చారు. అలాగే 6.83 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు.
దీనితో పాటు 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్ సదుపాయం కూడా ఉంది. ఫోన్‌లో ఏఐ క్రియేషన్ వంటి కృత్రిమ మేధస్సు ఆధారిత ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఫోన్‌తో పాటు iQOO బడ్స్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తాయి. వీటి ధర రూ. 1,699 నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ బడ్స్ విక్రయాలు ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. iQOO Z11 ఫోన్ల అమ్మకాలు ఆగస్టు 25 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.








