దేవరకొండ కుటుంబానికి చెందిన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న కూడా వరుసగా తమ సినిమాలతో థియేటర్లలోకి రాబోతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నటీనటులకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ నటించిన 'ఎపిక్' సినిమా విడుదల కానుంది. దీని తర్వాత అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన 'రణబాలి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 27న రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'మైసా' సినిమా విడుదలవుతుంది.

ఒక సినిమా విడుదలవుతుందంటే ప్రమోషన్లు, ప్రెస్ మీట్లు, టీజర్లు, ట్రైలర్ల కోసం కనీసం రెండు మూడు వారాల పాటు నటీనటులు ప్రజల్లోనే ఉంటారు. దీంతో రాబోయే మూడు నెలల పాటు దేవరకొండ ఫ్యామిలీ మొత్తం మీడియాలో, అభిమానుల మధ్య సందడి చేయనుంది.

ఇటీవల జరిగిన 'ఎపిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే మూడు నెలలు తమవేనని, తన రౌడీ బాయ్స్, గర్ల్స్ మధ్యే ఉంటామని చెప్పారు. ఈ మూడు నెలలు తమ కుటుంబానికి చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.