వర్షాకాలంలో మన శరీరంలోని రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి రెండూ గణనీయంగా తగ్గుతాయి. ఈ సమయంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కొన్ని ఆకుకూరలను పూర్తిగా నిషేధించారు వైద్యులు.

మునగాకు: వర్షపు తేమ వల్ల ఆకులలో చేదు తీవ్రమవుతుంది. బ్యాక్టీరియా, పురుగుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.

చామకూర: వర్షాకాలంలో ఇందులోని కాల్షియం ఆక్సలేట్ స్పటికాల పరిమాణం పెరుగుతుంది. సరిగ్గా ఉడికించకపోతే గొంతులో మంట, కడుపు అలర్జీలు సంభవించే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉండే ఈ సీజన్లో ఇది ప్రత్యేకంగా ప్రమాదకరం.

తోటకూర, పాలకూర: తేమతో కూడిన నేలలో పురుగులు, క్రిములు గుడ్లు పెట్టే అవకాశం ఎక్కువ. ఇవి జీర్ణవ్యవస్థకు హాని కలిగించి గ్యాస్ సమస్యలు తీసుకువస్తాయి. అందువల్ల వీటిని తినేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆకుకూరలు తినేటప్పుడు జాగ్రత్తలు: ఆకుకూరలను వండే ముందు ఉప్పు, పసుపు వేసిన గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి బాగా కడగాలి. సగం ఉడికించిన ఆకుకూరలను తినకూడదు. పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే వాటిని ఉపయోగించాలి.