ఆగస్టు 15 నుంచి జరగనున్న టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా ఇరు దేశాల మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ శుక్రవారం మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని, తొలి రోజు ఆటలో నిలకడగా రాణించింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌కు నిషాన్ మధుశంక (66), రవిందు రసంత (71) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మధుశంక రనౌట్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన పసిందు 35 పరుగులు, పవన్ 39 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచారు.
కెప్టెన్ సోనల్ దినుషా 52 పరుగులతో రాణించగా, రమేశ్ మెండిస్ 32 పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేశరా నువాంత (9), దిలుమ్ సుధీరా (1) ఉన్నారు.
భారత బౌలర్లలో జడేజా, మానవ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ సాధించారు.







