బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం తులంపై రూ.230 పెరిగిన బంగారం ధర, బుధవారం (ఆగస్టు 19) ఉదయం 6 గంటల సమయానికి మరో రూ.10 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,910 కి చేరింది.

ఇటీవల ధరలు తగ్గినట్లు అనిపించినా, మళ్లీ పరుగులు పెడుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే బంగారం ధర రూ.3,500 కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.

ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని వారు చెబుతున్నారు.

అయితే, బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ఆధారంగా నగరాల వారీగా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

బంగారం, వెండి ధరల తాజా సమాచారం కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు.