అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) హెచ్-1బి వీసా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని నాలుగు కంపెనీలపై నిషేధం విధిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
GowraTech, LLC, Renotek Group LLC, Seeloz, Inc., మరియు Sherwood at Mount Dora, Inc. అనే నాలుగు సంస్థలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలు హెచ్-1బి వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నిషేధం జూలై 1, 2026 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై ప్రభావం పడనుంది.
నిషేధం అమలయ్యే కాలపరిమితి కంపెనీని బట్టి 2027 లేదా 2028 వరకు కొనసాగుతుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది.







