హైదరాబాద్: కన్నడ స్టార్ హీరో యశ్ నటించి యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు చిత్ర యూనిట్‌కి శుభవార్త ఇచ్చింది. సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జిుస్టితో), మల్టీప్లక్స్‌లో రూ.100 (జిుస్టితో) పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయని, రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి రూ,కోటి డిపాజిట్ చేయాల్సిందిగా చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు సూచించింది.








