ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందించారు.

తెలంగాణ యాసలో సాగే ఈ ప్రేమ కథలో ఎమోషన్స్‌తో పాటు వినోదం కూడా ఉంటుందని దర్శకుడు రాజేష్ నాయుడు తెలిపారు. రసూల్ ఈ చిత్రానికి కథను అందించగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమాలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, శివన్నారాయణ, ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణ సినిమాల కంటే భిన్నంగా, కుటుంబ భావోద్వేగాలతో ఈ చిత్రం ఉండబోతోందని నిర్మాత బిచ్చు నాయక్ చెప్పారు.