అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, పెకోస్ కౌంటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రానికి అవసరమైన విద్యుత్తును అందించేందుకు ఒక కొత్త విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించేందుకు అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టింది.
ఈ ప్లాంట్ ద్వారా ఏకంగా 33 మిలియన్ టన్నుల కాలుష్యం విడుదలయ్యే ప్రమాదం ఉందని అంచనా.
ఈ పరిణామం అమెజాన్ సంస్థకు పెద్ద సవాలుగా మారింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమెజాన్ గతంలో ప్రకటించింది.








